Social News XYZ     

RRR movie in two parts?

రాజమౌళి సినిమా కొత్త రూమర్ !

RRR movie in two parts?

రాజమౌళి, ఎన్‌టి‌ఆర్ చరణ్ సినిమాకు సంభందించిన కొత్త రూమర్ బయటికి వచ్చింది. విషయం ఏంటంటే.. రాజమౌళి ఈ సినిమాను రెండు పార్ట్శ్ గా తీయ్యబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ న్యూస్ కు సంభందించి ఎక్కడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు.

 

2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. చరణ్, ఎన్‌టి‌ఆర్ ఈ సినిమా కోసం వచ్చే ఏడాది అక్టోబర్ వరుకు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ వరుకు వీరిద్దరు ఈ సినిమా కాకుండా వేరే సినిమా ఒప్పుకోరు. అక్టోబర్ నుండి మార్చి వరుకు పోస్ట్ ప్రొడక్షన్ చేసి మే 2020లో చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు.

జనవరి 19 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది రెండో షెడ్యూల్. మొదటి షెడ్యూల్ లో ఎన్‌టి‌ఆర్ ఎక్కువ రోజులు నటించాడు, చరణ్ ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నాడు. సెకండ్ షెడ్యూల్ నుండి ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరనేది రాజమౌళి సంక్రాంతికి ప్రకటించే అవకాశం ఉంది.

Facebook Comments

%d bloggers like this: