Social News XYZ     

Ram-Puri movie to have a Telugu girl

పూరీ, రామ్ సినిమాలో తెలుగమ్మాయి !.

Ram-Puri movie to have a Telugu girl

దర్శకుడు పూరీ జగన్నాధ్ హీరో రామ్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఛార్మి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ కావలనీ తెలుగు అమ్మాయిలు ఎవరయినా ఉంటే ఫోటోలు పంపమని ఒక ప్రకటన ఇచ్చారు. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ ఆడిషన్స్ కు రెడీ అవుతున్నారు.

 

ఈ సినిమాలో కొత్త అమ్మాయిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. టాప్ హీరోయిన్ అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, సింపుల్ గా ఈ సినిమాను నిర్మించాలని చిత్ర దర్శకుడు పురి భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల నుండి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం చేస్తున్నారు. అంతలోపు హీరోయిన్ ను ఖరారు చెయ్యబోతున్నారు.

పురి జగన్నాధ్ ఈ మద్య తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది మేలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Facebook Comments

%d bloggers like this: