Social News XYZ     

Payal Rajput not doing a blind role in Ravi Teja – VI Anand movie

ఆర్.ఎక్స్.100 హీరోయిన్ పై అసత్య ప్రచారం !

Payal Rajput not doing a blind role in Ravi Teja - VI Anand movie

రవితేజ వరుస ఫ్లాప్ సినిమాల తరువాత వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డిస్కో రాజా పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. జనవరి నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.

 

ఈ చిత్రంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్.ఎక్స్.100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ రవితేజ పక్కన నటించే ఛాన్స్ కొట్టేయ్యడం విశేషం. ఈ చిత్రం పాయల్ కళ్ళు కనిపించని ఒక అంధురాలి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ న్యూస్ లో నిజం లేదంతోంది చిత్ర యూనిట్.

పాయల్ ఈ సినిమాలో ఒక కాలేజ్ అమ్మాయి పాత్రలో కనిపించనుందని, అంధురాలిగా నటిస్తుందన్న వార్తలో నిజం లేదని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోయిన్ నటిస్తోంది. ఇటీవల సుధీర్ బాబుతో నన్నుదోచు కుందువటే సినిమాలో నటించిన నభ నటేస్ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది.

Facebook Comments

%d bloggers like this: