Social News XYZ     

A first for Nani

నానికి ఇది మొదటిసారి !

A first for Nani

నాని నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం నాని జర్సీ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ మూవీతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

 

నానితో పాటు దుల్గర్ సల్మాన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు నాని ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. నాని మొదటిసారి పోలీస్ పాత్ర చేస్తుండడం విశేషం.

దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన అస్టా చెమ్మ, జెంటిల్మెన్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా అంటే పోసిటివ్ బజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Facebook Comments