Social News XYZ     

Sharwanand’s ‘Padi Padi Leche Manasu’ is based on real-life incidents

రియల్ ఇన్సిడెన్స్ తో శర్వానంద్ సినిమా !

Sharwanand’s 'Padi Padi Leche Manasu' is based on real-life incidents

శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం పడిపడి లేచే మనసు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 21న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాకు హను రాగవపూడి దర్శకత్వం వహించాడు.

 

తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథాంశం నేపాల్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించని సమాచారం. గతంలో నేపాల్ లో సంభవించిన భూకంపం ఈ సినిమా కథలో మెయిన్పాయింట్ గా ఉండనుందని సమాచారం. ప్యూర్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఫుడ్ బాల్ ప్లేయర్స్ గా కనిపించబోతున్నారు.

శర్వానంద్ ఈ సినిమాతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవుతోంది. త్వరలోనే శర్వానంద్ దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చెయ్యనున్నడు. ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది.

Facebook Comments

%d bloggers like this: