Social News XYZ     

Prabhas appreciates KGF movie

ఆ సినిమాను మెచ్చుకున్న ప్రభాస్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ముంబయివెళ్ళాడు. రాజమౌళి, రానాకూడా ప్రభాస్ తో కలిసి ముంబయి వెళ్ళి కరణ్ జోహార్ రియాలిటీ టాక్ తో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నారు. శనివారం ఈ షో లో రానా, రాజమౌళి, ప్రభాస్ పాల్గొనడం జరిగింది. ఈ షో త్వరలో టెలికాస్ట్ కానుంది.

నిన్న (శుక్రవారం) ముంబయి లో కన్నడ హీరో యష్ నటించిన కకే.జి.ఎఫ్ సినిమా స్పెషల్ ప్రీమియర్ వెయ్యడం జరిగింది ఈ షో కు ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది. యష్ పిలవగానే ప్రభాస్ ఆ చిత్ర షో కు హాజరు అయ్యి సినిమా చూసి, చిత్ర యూనిట్ ను అభినందించాడని సమాచారం. సినిమా బాగుందని ప్రభాస్ వారికి చెప్పడం విశేషం.

 

కే.జి.ఎఫ్ సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ హైదారాబాద్ లో ఆదివారం గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. డిసెంబర్ 21 న ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, హింది భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. యష్ కన్నడలో స్టార్ హీరో గా ఉండడం విశేషం.

Facebook Comments

%d bloggers like this: