Social News XYZ     

Saaho major part shoot completed

సాహో మేజర్ పార్ట్ పూర్తి చేసిన ప్రభాస్ !

Saaho major part shoot completed

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కెతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా సాహో. ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది.

 

సాహో చిత్ర షూటింగ్ మూడవ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసినట్లు దర్శకుడు సుజిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మేజర్ యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. తదుపరి షెడ్యూల్ జనవరి నుండి ఉండబోతోంది.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులు వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్ర షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

Facebook Comments

%d bloggers like this: