Social News XYZ     

Hero Rana Voice Over for Subrahmanyapuram

‘‘సుబ్రహ్మణ్యపురం’’  లో ‘‘భళ్లాల దేవుడు’’

Hero Rana Voice Over for Subrahmanyapuram

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతేరానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కథ ను నడిపించడం లో ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ను పోషించనుందట.

 

‘‘సుబ్రహ్మణ్యపురం’’ కీలక సన్నివేశాలకు రానా వాయిస్అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.దానికి ఆయన వెంటనేఅంగీకారం తెలిపారు.

దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలోరానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొనిఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది.

‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర్రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలకు కాబోతుంది.

భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదులమీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై  చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసినభగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యంఅవుతుందా..? ‘‘సుబ్రహ్మణ్యపురం’’లో దాగున్న రహాస్యం ఏంటి..?  ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేకఆకర్షణగా నిలిచే ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికేహిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లుపూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ఎఫెక్ట్స్ అందించిన టీం ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కు వర్క్ చేసారు. లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యంపాడిన థీమ్ సాంగ్ హైలెట్ గానిలుస్తుంది.  సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ మూవీ ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకులలో ఆసక్తి నిరేకెత్తించింది.

హీరో: స‌మంత్,

హీరోయిన్ః  ఈషారెబ్బ‌

ప్ర‌ధానతారాగ‌ణంః సురేష్, సాయికుమార్, ఆలి, స‌త్య సాయి శ్రీనివాస్,

మిర్చిమాధ‌వి, సుర్య‌, ర‌ఘునాథ్ రెడ్డి, సారిక రామ‌చంద్ర‌రావు, జోష్

ర‌వి, బ‌ద్రం, గిరిధ‌ర్, అమిత్ శ‌ర్మ‌, టి.ఎన్.ఆర్.

సాంకేతికవ‌ర్గంః

సినిమాటోగ్ర‌ఫిఃఆర్.కె. ప్రతాప్

ఎడిట‌ర్ఃకార్తిక్ శ్రీనివాస్

సంగీతంఃశేఖ‌ర్ చంద్ర‌

క్యాస్టూమ్డిజైన‌ర్ః సుమ త్రిపుర‌ణ‌

ఫైట్స్ఃడ్రాగ‌న్ ప్ర‌కాష్‌

పి.ఆర్.ఓఃజియ‌స్ కె మీడియా

కోడైరెక్ట‌ర్ః ఆర్.సురేష్

ప్రొడ్యూస‌ర్ః బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి

రైట‌ర్అండ్ డైరెక్ట‌ర్ః సంతోష్ జాగ‌ర్లపూడి

 

Facebook Comments
Hero Rana Voice Over for Subrahmanyapuram

About uma