Social News XYZ     

Varun Tej to be seen in a different role

విభిన్నమైన పాత్రలో వరుణ్ తేజ్ !

Varun Tej to be seen in a different role

వరుణ్ తేజ్ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కిరణ్ అనే ఈ యంగ్ డైరెక్టర్ వరుణ్ తేజ్ ను బాక్సర్ పాత్రలో చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ ఇలాంటి విభిన్నమైన పాత్రలో చెయ్యడం, అందుకు అంగీకరించడం విశేషం.

 

ప్రస్తుతం వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అందరిని ఆలోచింపజేసింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

అంతరిక్షం సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సినిమాలో చేస్తున్నాడు వరుణ్. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనెట్ గా ఉండబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్ ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నారు.

Facebook Comments

%d bloggers like this: