Social News XYZ     

Naga Chaitanya to work with Merlapaka Gandhi

ఫ్లాప్ డైరెక్టర్ తో అక్కినేని హీరో !

Naga Chaitanya to work with Merlapaka Gandhi

నాగ చైతన్య ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్నాడు. ఈ హీరో నటించిన యుద్దం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో పాటు వెంకీ మామ సినిమా చెయ్యబోతున్న చైతు కొత్తగా మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్ళితే...

 

యు.వి.క్రియేషన్స్ సంస్థలో చైతు ఒక సినిమా ఒప్పుకున్నాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. మేర్లపాక గాంధీ లాస్ట్ సినిమా కృష్ణార్జున యుద్దం సినిమా పెద్ద ఫ్లాప్. మరి ఈ సినిమాను ఎలా తీస్తాడో ఈ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ అంటే పెద్ద సంస్థ. చైతు ఈ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు అంటే కథ కథనాలు బాగా ఉంటాయి. భాగుమతి సినిమా తరువాత వీరు చేస్తున్న సినిమా ఇదే. ఈ బ్యానర్ లో ప్రభాస్ సాహో గత రెండు ఏళ్లుగా నిర్మాణంలో ఉంది.

Facebook Comments

%d bloggers like this: