Social News XYZ     

Sai Pallavi’s demands more money for re-shoots!

సాయి పల్లవి కొత్త డిమాండ్ !

Sai Pallavi's demands more money for re-shoots!

శర్వానంద్-సాయి పల్లవి, ప్రస్తుతం ఈ ఇద్దరు హను రాఘవపూడి దర్శకత్వంలో "పడి పడి లేచె మనసు" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంభందించి కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే సాయి పల్లవి ఈ సినిమాకు కేటాయించిన డేట్స్ కంప్లీట్ అయ్యాయి కావున మళ్ళీ షూట్ లో పాల్గొనడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు ఆగిగినట్లు వార్లలు వస్తున్నాయి.

 

ఏం.సి.ఏ సినిమా తరువాత సాయి పల్లవి నటించిన సినిమా ఇదే అవ్వడం విశేషం. తక్కువ సినిమాలు చేసినా, ఈ అమ్మాయి నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇరీవల ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన రెండు కోట్లు ఇచ్చినా చెయ్యనని చెప్పినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సాయి పల్లవి సినిమాను నూతన నిర్మాతలు నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. లై సినిమా ఫ్లాప్ అవ్వడంతో డైరెక్టర్ హను ఈ సినిమాను జాగ్రత్తగా తీసింటాడని వార్తలు వస్తున్నాయి.

Facebook Comments

%d bloggers like this: