Social News XYZ     

Noel Sean Starrer “Samayam Ledu Mitrama” Movie Launched

‘స‌మ‌యం లేదు మిత్ర‌మా’ షూటింగ్ ప్రారంభం

Noel Sean Starrer "Samayam Ledu Mitrama" Movie Launched

కె.వి.ప్రొడ‌క్ష‌న్ బ్యానర్‌లో.. ఎమ్. వరప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత జిఎమ్. ముర‌ళీధ‌ర్ నిర్మిస్తున్న చిత్రం ‘స‌మ‌యం లేదు మిత్ర‌మా’.  ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో జరిగింది. పూర్తి కామెడీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నోయ‌ల్‌, ట్వింకిల్ సౌజ్ (తొలిప‌రిచ‌యం) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 

ఈ సంద‌ర్భంగా నిర్మాత జి.ఎమ్. మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొద‌టి చిత్రం. డైరెక్ట‌ర్‌ వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చి.. ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాం. మాకు మీ అంద‌రి ఆద‌ర‌ణ కావాలి..’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎమ్.వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్ మీకు తెలిసిందే. క్యాచీ టైటిల్‌. ఈ చిత్రం కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్. న‌న్నున‌మ్మి మా ప్రొడ్యూస‌ర్‌గారు ఈ బాధ్యతలు అప్ప‌గించారు. అంద‌రం క‌లిసి చేస్తున్నాం. ఈ చిత్రానికి చాలా మంచి టెక్నీషియ‌న్లు కూడా కుదిరారు. న‌గేష్ ఈ చిత్రంలో త‌న విశ్వ‌రూపం చూపించ‌బోతున్నారు..’’ అని అన్నారు.

న‌గేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను మొయిన్ విల‌న్‌గా చేస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాంచాల కిషన్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్టోరీ బాగా కుదిరింది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.

నోయ‌ల్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో అర్ధ‌మైపోతుంది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో నేను చాలా మంచి క్యారెక్ట‌ర్‌ని చేస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్ల‌స్ అవుతుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రైట‌ర్ ఈ చిత్రానికి డైలాగులు బాగా రాశారు. మా చిత్రానికి అంద‌రూ త‌ప్ప‌క స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

ఈ చిత్రానికి స‌హ‌నిర్మాతలు: చ‌ల్లా మ‌హేష్‌, అశోక్‌గౌడ్‌,  డైలాగ్స్: కోలా న‌వీన్‌, కొరియోగ్ర‌ఫీ: అని‌, స్టంట్స్: దేవ‌రాజ్‌, ఆర్ట్: ఆనంద్, ఎడిట‌ర్: ఉపేంద్ర‌, సంగీతం: అజ‌య్‌ప‌ట్నాయ‌క్‌, డి.ఓ.పి: ప్ర‌వీణ్ కె.కావ‌ళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాంచాల కిషన్, నిర్మాత: జి.ఎమ్. మురళీధర్, దర్శకత్వం: ఎమ్.వ‌ర‌ప్ర‌సాద్.

Facebook Comments
Noel Sean Starrer "Samayam Ledu Mitrama" Movie Launched

About uma