Social News XYZ     

Varun Tej to work with Harish Shankar

ఫ్లాప్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్!

Varun Tej to work with Harish Shankar

ఫిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి విజయాలు సాధించిన హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం, ఎఫ్2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో మొదటిది డిసెంబర్ లో విడుదల కాబోతోంది, రెండో సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ రెండు చిత్రాల తరువాత వరుణ్ తేజ్ మరో మూడు సినిమాల్లో నటించడానికి రెడీ అయిపోతున్నాడు. అందులో మొదటిది దర్శకుడు హరీష్ శంకర్ సినిమా. డిజే సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన హరీష్ తో వరుణ్ త తమిళంలో సిద్దార్ద హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన 'జిగర్‌తండ'. చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయటానికి రైట్స్ తీసుకుని వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. .

 

అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటీ అంటే 'జిగర్‌తండ' చిత్రాన్ని ఆల్రెడీ తెలుగులో 'చిక్కడు దొరకడు' టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. మరోసారి హరీష్ శంకర్ తనదైన స్టయిల్ లో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో మరో యువహేరో నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలతో పాటు డైరెక్టర్ సాగర్ చంద్ర తో ఒక సినిమా పరుశురామ్ బుజ్జితో మరో సినిమా చెయ్యబోతున్నాడు వరుణ్ తేజ్.

Facebook Comments
Varun Tej to work with Harish Shankar

About uma