Social News XYZ     

Rayalaseema Love Story movie teaser gets a good response

రాయలసీమ లవ్ స్టోరీ మోషన్ పోస్టర్,టీజ‌ర్ కు కు మంచి రెస్పాన్స్

Rayalaseema Love Story movie teaser gets a good response

ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '' రాయలసీమ లవ్ స్టోరీ ''. వెంకట్ ని ,హృశాలి గోసవి ని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం లో తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటిస్తున్నారు.ఇటీవ‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు చేతులు మీదుగా రిలీజైన ఫ‌స్ట్ లుక్ ,టీజ‌ర్ కు బ్ర‌హ్మండమైన రెస్పాన్స్ వ‌చ్చింది..ఈ సంద‌ర్భంగా ....

 

దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ " నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది ,నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు . యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది . మా చిత్రంలో అద్భుతమైన పాటలున్నాయి , ఎలేందర్ ఇచ్చిన ట్యూన్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం అన్నారు.. ఇటీవ‌ల రిలీజైన మోష‌న్ పోస్ట‌ర్ ,టీజ‌ర్ కు బ్ర‌హ్మండైన రెస్పాన్స్ వ‌స్తోంది..మేము ఉహించిన‌దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు...

చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా - నాగరాజు లు మాట్లాడుతూ " రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . సినిమా రష్ చూసుకున్నాం చాలా బాగా వచ్చింది . ఈరోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేది యువతరమే కాబట్టి వాళ్లకు నచ్చే విధంగా ఈ సినిమాని రూపొందించడం జరిగింది . టీజ‌ర్ కు వ‌చ్చిన రెస్సాన్స్ చూసి సినిమా పై మ‌రింత కాన్పిడెన్స్ పెరిగింద‌న్నారు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి . త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తామ‌ని అన్నారు...

Facebook Comments
Rayalaseema Love Story movie teaser gets a good response

About uma