Social News XYZ     

RRR not titled “Rama Ravana Rajyam”

రాజమౌళి సినిమాపై గాసిప్స్!

RRR not titled "Rama Ravana Rajyam"

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు రామ రావణ రాజ్యం టైటిల్ ఖరారు అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కానీ అసలు ఈ టైటిల్ కు సినిమాకు సంభందం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి సినిమా చరిత్రాత్కమైన కథాంశంతో తెరకెక్కబోతోంది. ఇలాంటి టైటిల్ సినిమాకు పెట్టె అవకాశం లేదని సమాచారం. . చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరుకు ఎలాంటి గాసిప్స్ ను నమ్మలేము.

 

గతంల కూడా ఈ సినిమాకు ఇద్దరు ఇద్దరే టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ లో నిజం లేదు. రాజమౌళి ఎన్‌టి‌ఆర్ చరణ్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటినుండి ఈ సినిమాపై రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈనెల మూడోవారం నుండి ప్రారంభం కానుందని సమాచారం. హైదారాబాద్ లో వేసిన ఒక సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇద్దరు టాప్ హీరోలు టాప్ దర్శకుడితో సినిమా చేస్తున్నందున ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి.

Facebook Comments

%d bloggers like this: