Social News XYZ     

Rana And Sai Pallavi Team Up For A Love Story To Be Directed By Venu Udugula

తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయి పల్లవి!

ఏం.సి.సి సినిమా తరువాత సాయి పల్లవి వేరే సినిమా ఒప్పుకోలేదు. లేటెస్ట్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో నటించడానికి ఈ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ సినిమాలో మరోసారి తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించబోతోంది ఈ హీరోయిన్. రానాఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. నూతన నిర్మాతలు నిర్మించబోతున్న ఈ సినిమాను వేణు ఉడుగుల తెలంగాణలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు.

విరాట పర్వం అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. మొదట ఈ సినిమాను శర్వానంద్ చెయ్యాలి అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శర్వా ఈ సినిమా చెయ్యలేకపోయాడు. రానా ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత రానా ఒప్పుకున్న తెలుగు సినిమా ఇదే అవ్వడం విశేషం.

 

Facebook Comments
Rana And Sai Pallavi Team Up For A Love Story To Be Directed By Venu Udugula

About uma

%d bloggers like this: