Social News XYZ     

Ravi Teja to romance Kajal for a 3rd time

కాజల్ ముచ్చటగా మూడోసారి !

Ravi Teja to romance Kajal for a 3rd time

దర్శకుడు వి.ఐ.ఆనంద్ రవితేజతో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో వీరా, సారోచ్చారు సినిమాలో రవితేజ కాజల్ నటించారు. మూడోసారి రవితేజ, కాజల్ ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నభ నటేశ్ మరో హీరోయిన్ గా నటించబోతోంది. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

 

నేలటిక్కెట్ సినిమాను నిర్మించిన రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ మూవీ డిఫరెంట్ కన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోందని సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది. వి.ఐ.ఆనంద్ సినిమాలో మరో హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Facebook Comments

%d bloggers like this: