Social News XYZ     

It’s Mahesh, Not Prabhas

ప్రభాస్ కాదు మహేశ్ బాబే !

It's Mahesh, Not Prabhas

సుకుమార్ రంగస్థలం సినిమా తరువాత మహేశ్ బాబుతో సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు మహేశ్ బాబు సినిమా క్యాన్సల్ అయ్యిందని ప్రభాస్ తో సుకుమార్ సినిమా ఉంటుందని న్యూస్ వచ్చింది. కానీ సుకుమార్ మహేశ్ బాబు కోసమే కథ సిద్దం చేసినట్లు సమాచారం. మహేశ్ కూడా సుకుమార్ చెప్పిన పాయింట్ ఒకే చేసి దాన్ని డెవలప్ చెయ్యమని చెప్పడని తెలుస్తోంది. సుకుమార్, ప్రభాస్ సినిమాలో ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

 

ఈ సినిమా తరువాత రాధాకృష్ణ సినిమా చెయ్యబోతున్నాడు. 2020 వరుకు ప్రభాస్ ఖాళీగా లేడు. మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జనవరి నుండి సుకుమార్, మహేశ్ సినిమా ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. తెలంగాణ నేపద్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

Facebook Comments

%d bloggers like this: