Social News XYZ     

Venky Mama rumors can be put to reset now!

వెంకీ మామ గురించి వ‌స్తోన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు..!

Venky Mama rumors can be put to reset now!

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో ఓ సినిమా రానుంద‌ని..ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అటు వెంకీ అభిమానులు  ఇటు నాగ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెర పై చూస్తామా అని ఆస‌క్తితో  ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ కి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

 

అయితే..ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది కానీ...ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాక‌పోవ‌డంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్ర‌చారం మొద‌లైంది. అస‌లు విష‌యం ఏంటంటే...వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. నాగ‌చైత‌న్య ఓ వైపు స‌వ్య‌సాచి ప్ర‌మోష‌న్స్, మ‌రో వైపు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న వెంకీ మామా ఇంకా స్టార్ట్ కాలేదు. అంతే కానీ..ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఈ సినిమా ఆగిపోలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం... న‌వంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. నాగ చైత‌న్య న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడ‌ని తెలిసింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌కు ఓ పండ‌గ అని చెప్ప‌చ్చు.

Facebook Comments

%d bloggers like this: