Social News XYZ     

24 Kisses movie trailer launched

24 కిసెస్ ట్రైలర్ లాంచ్

24 Kisses movie trailer launched

సిల్లీ మానక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పించు రెస్పెక్ట్ క్రియేషన్స్ వారి అనీల్ ్ల, సంజయ్ నిర్మించిన చిత్రం ౨౪కిసెస్. అయోధ్యకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అదిత్ అరుణ్, హెబ్బాపటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో సీనియర్ నరేష్ మాట్లాడుతూ... అయోధ్య కుమార్ మిణుగుర్లు సినిమాకి ౯ నంది అవార్డులు గెలుచుకున్నారు. ఆ సినిమాని ఇద్దరం కలిసి చూశాం. రానున్న రోజుల్లో ఆయోధ్యకుమార్ నుంచి చాలా రాబట్టుకోవచ్చు. కిసెస్ అనగానే ప్రతిఒక్కరూ ఫాల్స్‌గానే ఆలోచిస్తారు. రొమాన్స్ అన్నది పూర్వకాలం చరిత్రలనుంచే మొదలైంది. రామాయణం, మహాభారతం నుంచే మొదలైంది. కిస్ అనేది ఒక అందమైన ఎమోషన్. ఒక వ్యక్తి మీద మరో వ్యక్తికి ప్రేమ పెరగాలంటే ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా అవసరం. అందమైన ప్రేమ కావ్యం తీశాం. తప్పకుండా చూడండి. ఇది యూత్ మాత్రమే చూసే సినిమా కాదు. ఫ్యామిలీ అందరూ వెళ్ళాల్సిన మూవీ. ముద్దుని చాలా మనోహరంగా, అందంగా తీసుకున్న చిత్రమిది.

 

డైరెక్టర్ అయోధ్య మాట్లాడుతూ... ట్రైలర్ చూసి నచ్చిందో లేదో మీరే చెప్పాలి అన్నారు. నరేష్‌గారు సినిమా గురించి ఆల్‌రెడీ చెప్పారు. రావురమేష్‌గాని, సీనియర్ నరేష్‌గారు కాని ఏదన్నా సినిమా ఒప్పుకుని చేశారు అంటే అది వర్త్‌లెస్ సినిమాలు మాత్రం కాదు. ఈ చిత్రంలో పాటలు కూడా చాలా బావున్నాయి. డిఓపి కూడా బాగా కష్టపడి చేశారు. కిస్ ఇవ్వడమనేది గొప్పకాదు కిస్‌కి ముందు వెనుక ఇవ్వవలసిన ఎమోషన్స్ పండడం చాలా అవసరం. ఆడియన్స్ అందరూ చూడదగ్గ చిత్రమిది. ఆడియన్స్ ౨౪ కిసెస్ ఉన్నాయి ఈ చిత్రంలో అని రారు. కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రంలో అందరూ చాలా కష్టపడి చేశారు మీరు తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాను అని అన్నారు.

హీరో అనిరుధ్ మాట్లాడుతూ... హీరో నాని ఒక ఆడియో ఫంక్షన్‌లో చెప్పారు నువు ఏదన్నా లవ్ స్టోరీ చేస్తే బావుంటుందని కాని నేను ఇప్పటివరకు అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళాను. ప్రతి లవ్ స్టోరీలో ఇంటర్‌నల్ కాన్‌ఫ్లిక్ట్, అలాగే సినిమాలో ఇగో కూడా కనిపిస్తుంది. సినిమా బ్యానర్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఈ సినిమాకి ఇద్దరు పెద్ద పిల్లర్లు ఒకరు సీనియర్‌నరేష్‌గారు, ఇంకొకరు రావురమేష్‌గార. వీళ్ళిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.

హెబ్బా మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు.

కీర్తన మాట్లాడుతూ... నాకు ఈచిత్రంలో నటించే అవకశాం ఇచ్చిన దర్శక నిర్మాతలకి నా కృతజ్ఞతలు, ఆడిషన్ జరిగిన తర్వాత చాలా రోజులకి నాకు కాల్ వచ్చింది. నేను అయితే ఇంక ఈ సినిమాలో నాకు అవకాశం లేదు అనుకున్నా కాని గుర్తుంచుకుని కాల్ చేసిన నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు.

Facebook Comments
24 Kisses movie trailer launched

About uma