Social News XYZ     

Lekha Washington targets STR?

ఆ హీరోయిన్ శింబును టార్గెట్ చేసిందా ?

Lekha Washington targets STR?

మీటూ వివాదం రొజురోజుకు ముదురుతోంది. మొదట చిన్మయి రైటర్ వైరమత్తు గురించి సంచలన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి మీటూ వివాదం స్టార్ట్ అయ్యింది. ఆ సంఘటన తరువాత తనుశ్రీ దత్త నానా పటేకర్ పై కామెంట్స్ చేసింది, లేటెస్ట్ గా అర్జున్ పై నటి శృతి హరిహారన్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇలా రోజుకొకరు వారికి జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకుంటున్నారు.

 

అదే క్రమంలో తమిళ హీరోయిన్ లేఖ వాషింగ్టన్ కూడా తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ట్విట్టర్ లో ఆమె మీటూ ట్యాగ్ తో పాటు కెట్టవన్ వర్డ్ ను ట్యాగ్ చేశారు. కెట్టవన్ అనేది శింబు నటించిన సినిమా. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శింబు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటాడని ఆమె పెట్టిన ట్వీట్ ను చూస్తే అర్థం అవుతోంది. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

Facebook Comments

%d bloggers like this: