Social News XYZ     

Mega Hero doing movie rejected by Nani

నాని రిజెక్ట్ చేసిన కథతో మెగా హీరో సినిమా !

Mega Hero doing movie rejected by Nani

నాని జర్సీ సినిమా దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంతో పాటు నాని మరో కొత్త సినిమాను చెయ్యబోతున్నాడు, కిశోరుడు అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. నాని ఈ చిత్రంలో రైతు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. వ్యవసాయం చేసే రైతుల గురించి సినిమా కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

కిశోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఒక సినిమా చెయ్యాలి, కానీ కథ పెద్దగా నచ్చకపోవడంతో నాని ఆ చిత్రాన్ని చెయ్యడం లేదు. అదే కథను సాయి ధరమ్ తేజ్ ఒకే చేశాడు. ఇటీవలే ప్రారంభం అయ్యింది. నాని ఈ చిత్రంతో పాటు చంద్రశేఖర్ యెలేటి దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా జనవరి నుండి ప్రారంభం కానుంది. థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 2 తరువాత నాని వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Facebook Comments

%d bloggers like this: