Social News XYZ     

Rx 100 hero dumps a pending movie

ఆర్.ఎక్స్.100 హీరో ఫ్లాప్ సినిమా స్టోరీ !

Rx 100 hero dumps a pending movie

ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఈ హీరో నటించిన మొదటి సినిమా ప్రేమతో కార్తీక్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఎవ్వరూ ఈ హీరోను పెద్దగా పట్టించుకోలేదు. ఆర్.ఎక్స్.100 సినిమా హిట్ అయ్యాక అందరూ ఈ హీరోపై పడ్డరు. ఆర్.ఎక్స్.100 సినిమా విడుదలకు ముందు ఈ హీరో చేతిలో సినిమాలు లేవు. అవకాశాలకోసం ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన ఒక ప్రాజెక్టు ను ఒప్పుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ కొంతవరుకు పూర్తి అయ్యింది.

 

ఇప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పాత కథ కావున ఇప్పుడు ఆ సినిమా విడుదలైన ఎవ్వరూ చూడరు. ఆర్.ఎక్స్.100 సినిమా హిట్ అయ్యింది, ఇదే సక్సెస్ ను కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఈ సమయంలో పాత సినిమా ఎందుకు అని ఆ మూవీని ఆపేయ్యాలని, అందుకోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని హీరో కార్తికేయ ఆ చిత్ర నిర్మాతలతో చెప్పినట్లు సమాచారం. మరి ఆ సినిమా ఏమవుతోందో చూడాలి.

Facebook Comments

%d bloggers like this: