Social News XYZ     

Varun Tej do a love story set during Pre-Independence

 బిఫోర్ ఇండెపెండెన్స్ లవ్ స్టోరీలో వరుణ్ తేజ్ !

Varun Tej do a love story set during Pre-Independence

'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్తన తర్వాతి సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ప్రారంభం అయ్యే ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. స్వాతంత్ర్యం ముందు జరిగే ప్రేమకథ, ప్రస్తుతం జరిగే లవ్ స్టోరీగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు సమాచారం.

 

నటనకు స్కోప్ ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. కథ, కథనాలు నచ్చడంతో ఈ సినిమను చెయ్యడానికి వరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ తెలుస్తోంది. రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. దసరాకు చిత్రాన్ని ప్రారంభించి డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్న ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం అంతరిక్షం సినిమాలో నటిస్తున్నాడు. సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.

Facebook Comments

%d bloggers like this: