Social News XYZ     

Raviteja to do a dual role in Vi Anand film

రవితేజ రెండు విభిన్న పాత్రల్లో !

Raviteja to do a dual role in Vi Anand film

వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రవితేజ చెయ్యబోతున్న సినిమాను రామ్ తాళ్ళూరి నిర్మించబోతున్నారు. డిసెంబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి, కొడుకులుగా రవితేజ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపద్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి పూర్తి సమాచారం తెలియనుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడిగా వి.ఐ.ఆనంద్ తానెంతో నిరూపించుకున్నాడు. .

 

వి.ఐ.ఆనంద్ సినిమా రవితేజతో కావడంతో ఈ ప్రాజెక్టు పై అంచనాలు ఉన్నాయి. సుధీర్ బాబు నటించిన నన్ను దోచు కుందువటే సినిమాలో నటించిన హీరోయిన్ నభ నాటాశా ఈ సినిమాలో రవితేజ పక్కన నటించబోతోంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంథోనీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Facebook Comments
Raviteja to do a dual role in Vi Anand film

About uma

%d bloggers like this: