Social News XYZ     

Anupama Parameswaran not signing any new films

అనుపమ కాస్త ఆలస్యంగా !

Anupama Parameswaran not signing any new films

అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా తరువాత ఆరు చిత్రాల్లో నటించింది. లేటెస్ట్ గా ఆమె నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది ఈ హీరోయిన్. తనకు సినిమా చెయ్యమని కొంతమంది దర్శక నిర్మాతలు అడుగుతున్నా ఆమె త్వరగా సినిమా ఒప్పుకోవడం లేదని సమాచారం.ఆమె తెలుగులో చేసిన ఎక్కువ సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. వచ్చే సినిమాలు కూడా ఫ్లాప్ అయితే కెరీర్ లో మంచి సినిమాలు రావని ఆమె కథ ఒకటికి రెండుసార్లు ఆలోచించి సినిమా సైన్ చేస్తోందని సమాచారం.

 

రామ్ పక్కన నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమాలో అనుపమ కథకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిందని, సినిమా తప్పకుండ అన్నీ వర్గాల ప్రేక్షకలు నచ్చుతుందని అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ లో తెలిపింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ కానుందని టాక్ వినిపిస్తోంది.

Facebook Comments
Anupama Parameswaran not signing any new films

About uma