Social News XYZ     

Bunny awaits Aravindha

అరవింద కోసం బన్నీ వెయిటింగ్ !

Bunny awaits Aravindha

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో చెయ్యబోతున్నాడనేది అనేది ఇప్పటివరుకు క్లారిటీ లేదు. అరవింద సమేత సినిమా హిట్ అయితే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇదివరుకే త్రివిక్రమ్ బన్నీ కోసం ఒక సబ్జెక్టు రెడీ చేసినట్లు సమాచారం. గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సత్యమూర్తి సినిమాలు ఆడియన్స్ ను నిరాశ పరచలేదు. మూడోసారి వీరిద్దరు సినిమా చేస్తున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఉంటాయి కావున ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు.

 

అరవింద సమేత సినిమా విడుదల తరువాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారు. విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ విక్రమ్ చెప్పిన పాయింట్ బన్నికి పూర్తి స్థాయిలో నచ్చలేదని సమాచారం. కమర్షియల్ గా విక్రమ్ చెప్పిన పాయింట్ వర్క్ఔట్ అవ్వదని బన్నీ ఆ సబ్జెక్టు ను పక్కన పెట్టినట్లు సమాచారం. అరవింద సమేత సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే బన్నీ సినిమా ఇస్తాడా ? లేదా అనేది కూడా చిన్న సందేహమే. అక్టోబర్ 11న అరవింద రిజల్ట్ కోసం ఎన్‌టి‌ఆర్ అభిమానులతో పాటు బన్నీ కూడా వెయిటింగ్.

Facebook Comments

%d bloggers like this: