Social News XYZ     

Nithya Menen in Nani’s Jersey movie !!

నాని సినిమాలో నిత్య మీనన్ !

Nithya Menen in Nani's Jersey movie !!

బిగ్ బాస్ పూర్తి అయ్యింది. ఇప్పుడు నాని పూర్తి ఫోకస్ సినిమాలపై పెట్టాడు. ఈ నెల 18న దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చెయ్యబోతున్న జర్సీ సినిమాను ప్రారంభించబోతున్నాడు. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాని మూడు విబిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. మళ్ళిరావా సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు గౌతమ్ తో నాని సినిమా చెయ్యబోతుండడం విశేషం. .

 

సితార ఎంటర్టైమెంట్స్ సంస్థ నిర్మించబోతోంది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రంలో నిత్య మీనన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోందని సమాచారం. సినిమాలో ఉండే ఒక ముఖ్యమైన పాత్రకు నిత్య అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు, పాత్ర నచ్చడం, పైగా నాని సినిమా అవ్వడంతో నిత్య ఈ సినిమాకు ఒకే చెప్పినట్లు సమాచారం. గతంలో నాని, నిత్య మీనన్ నటించిన అలా మొదలయ్యింది సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Facebook Comments

%d bloggers like this: