Social News XYZ     

Prayatnam Movie Press Meet Held

ప్రయత్నం సినిమా ప్రెస్  మీట్  

Prayatnam Movie Press Meet Held

అభయ్ ప్రొడక్షన్ పతాకం పై విశాఖపట్నం లోని నూతన నటీనటులతో ధనుంజయ్, హ్రితిక సింగ్ హీరో హీరోయిన్ గా దినేష్ పి దర్శకత్వం లో నిర్మించిన సినిమా 'ప్రయత్నం'. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ

 

దీక్షిత్ గారు మాట్లాడుతూ... తన శిష్యుడైన ధనుంజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం మూవీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ రోజుల్లో సినిమా నిర్మాణం అంటే మాటలుకాదన్నారు.ఎన్నో కస్థానష్టాల్ని భరించి ఈ మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వదించారు. ఈ సినిమాలో భాగం అయిన అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని అన్నారు.

హీరో మరియు నిర్మాత ధనుంజయ్ మాట్లాడుతూ... చిన్ననాటి నుండి సినిమా పై ఉండే ప్రేమతోనే ఈ మూవీ చేశానని అన్నారు. నటించాలనే కోరిక ఉండి అవకాశాల కోసం ఎదురురుచూస్తోన్న వైజాగ్ ప్రాంత కళాకారులకు ఈ మూవీ ద్వారా అవకాశం కల్పించామని అన్నారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు.

పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ... సినీ రంగం లో నిలదొక్కుకోవాలని చాలా మంది కలలు కంటారని అయితే ధనుంజయ్ అందరికంటే భిన్నంగా ఆలోచించి ప్రయత్నం సినిమాతో వస్తున్నా డని అన్నారు. చిరు అభిమాని అయిన ధనుంజయ్ వైజాగ్ ప్రాంతం లో ఉన్న కళాకారుల్ని ప్రోత్సహించేందుకు చేసిన ఈ ప్రయత్నం మూవీ విజయం సాధించాలని ఆశీర్వదించారు. మూవీ కి సంభంధించి ఏవైనా మెళకువలు కావాలంటే ఎప్పుడు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

హీరోయిన్ మాట్లాడుతూ... తెలుగులో మొదటిసారి నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. జాలారి ప్రాంత వాసిగా ఇందులో నటించడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీ ద్వారా అందరికీ మంచి అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను.

Facebook Comments
Prayatnam Movie Press Meet Held

About uma

%d bloggers like this: