Social News XYZ     

Nithiin’s next with a Blockbuster director!!

హిట్ డైరెక్టర్ తో నితిన్ సినిమా !

Nithiin's next with a Blockbuster director!!

ఆర్.ఎక్స్.100 సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి తన తరువాతి సినిమా రామ్ తో చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో మరో హీరో నటించబోతున్నాడని అన్నారు. కానీ తాజా సమాచారం మేరకు అజయ్ భూపతి నెక్స్ట్ సినిమా హీరో నితిన్ తో చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియెషన్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. నితిన్ నటించిన సినిమాలు లై, స్రినివస కళ్యాణం పెద్దగా సక్సెస్ కాలేదు.

 

ఈసారి చేయబోయే సినిమాతో తాను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కలని భావిస్తున్నాడు. ఛలో సినిమాతో విజయం సాధించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చెయ్యబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నితిన్ వెంకీ కుడుముల చెప్పిన పాయింట్ కు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది. వెంకీ సబ్జెక్టు పక్కన పెట్టి అజయ్ భూపతి కథతో ముందుకు వెళ్లబోతున్నాడు నితిన్.

Facebook Comments

%d bloggers like this: