Social News XYZ     

Dil Raju to postpone his movie release?

దిల్ రాజు సినిమా వాయిదా పడబోతోందా ?

Dil Raju to postpone his movie release?

దిల్ రాజు నిర్మాతగా రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా హలోగురూ ప్రేమకోసమే. త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 18నా విడుదల కాబోతోందని చిత్రా యూనిట్ వెల్లడించారు. కానీ ఆ డేట్ కు సినిమా రావడం కస్టమే అంటున్నారు. ఎందుకంటే ఎన్‌టి‌ఆర్ అరవింద సమేత సినిమా అక్టోబర్ 11నా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా విడుదలైన వారం తరువాత రామ్ సినిమా వస్తే పెద్దగా వసూళ్లు రాకపోవచ్చని దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. .

 

ఎన్‌టి‌ఆర్ సినిమా ఎఫెక్ట్ మినిమమ్ రెండు వారాలు ఉంటుంది కావున అక్టోబర్ 25నా హలోగురూ ప్రేమకోసమే సినిమా విడుదల చేస్తే బాగుంటుందని హీరో రామ్ దిల్ రాజుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సింగల్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దేవి సంగీతం అందించిన ఈ పాట ఆకట్టుకోలేదు. మిగిలిన పాటలు ఎలా ఉన్నాయో చూడాలి. టీజర్ కు మంచి ఆధరణ లభించింది. రామ్ నటించిన లాస్ట్ సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ పెద్దగా సక్స్సెస్ కానందున ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు.

Facebook Comments

%d bloggers like this: