Social News XYZ     

Venkatesh-Chaitanya movie scrapped?

వెంకటేష్ సినిమా ఆగిపోయిందా ?

Venkatesh-Chaitanya movie scrapped?

నిర్మాత సురేశ్ బాబుకు కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కస్టమని అంటుంటారు దర్శకులు. లేటెస్ట్ గా డైరెక్టర్ బాబీ వెంకటేష్, నాగ చైతన్య తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. కానీ సినిమా షూటింగ్ మొదలుకాలేదు. అందుకు కారణం ఏంటంటే నిర్మాత సురేశ్ బాబు కథను ఇప్పటివరుకు ఒకే చేయలేదని అందుచేతనే సినిమా ఆలస్యం అవుతోందని అంటున్నారు. స్టోరీ లైన్ ఒకే కానీ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు సెకండ్ హాఫ్ సురేశ్ బాబుకు నచ్చడం లేదని అంటున్నారు. .

 

గత ఆరు నెలలుగా బాబీ సురేశ్ బాబును ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నా బాబుకు పూర్తిస్థాయిలో నచ్చడం లేదని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్ లో చాలా మండి దర్శకులు ఇలానే కథలు సిద్దం చేసి వెళ్ళిపోయారు. కిశోర్ తిరుమల, పురి జగన్నాధ్, బొమ్మరిల్లు భాస్కర్, తేజ వంటి దర్శకులు అక్కడ కొంతకాలం స్క్రిప్ట్ వర్క్స్ చేసి బయటికి వచ్చేశారు. బాబీ సినిమా సురేశ్ ప్రొడక్షన్ లో ఉంటుందా ? లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మొన్నటివరుకు తేజ సినిమా వెంకటేష్ తో ఉంటుంది అన్నారు పూజా కార్యక్రమాలు జరిగాయి కనే సినిమా ఆగిపోయింది. ఈ సినిమా కూడా విధంగా జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Facebook Comments

%d bloggers like this: