Social News XYZ     

Veteran filmmaker K. Raghavendra Rao praises Nannu Dochukunduvate movie team

ద‌ర్శ‌కేంద్రుడి మ‌న‌సు దోచుకున్న న‌న్నుదోచుకుందువ‌టే..

Veteran filmmaker K. Raghavendra Rao praises Nannu Dochukunduvate movie team

సుధీర్‌బాబు ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో మెట్ట‌మెద‌టి చిత్రం గా న‌న్నుదోచుకుందువ‌టే చిత్రం ప్ర‌పంచంలో వున్న తెలుగు ప్రేక్ష‌కులందరి హృదయాల్ని దోచుకుంటోంది. సుధీర్‌బాబు, న‌భా న‌టేష్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి ఆర్‌.ఎస్ నాయిడు ద‌ర్శ‌కుడు. సూపర్ పాజిటివ్ పబ్లిక్ టాక్ తో ఈ చిత్రం కలెక్షన్స్ పెరుగుతుండడం విశేషం. మొద‌టి రోజు కంటే రెండో రోజు క‌లెక్ష‌న్స్ మూడు రెట్లు అధికంగా పెరగడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. సినీ ప్రేక్ష‌కుల్నే కాకుండా చాలా మంది సెల‌బ్రిటిస్ ని ఈ చిత్రం విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, ఇంద్ర‌గంటి మెహ‌న‌కృష్ణ‌, నాని, సందీప్ కిషన్, బి.వి.య‌స్ రవి, గోపి మెహ‌న్‌, అడ‌విశేషు లాంటి స్టార్స్ తమ ప్రశంసల్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. అయితే శ‌తాధిక ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారు ఈ చిత్రాన్ని చూసి ప్ర‌త్యేకంగా యూనిట్ ని పిలిచి ప్రోత్సహించి శుభాశిస్సులు అందించడం విశేషం.. ఈ చిత్రం ఆయ‌న మ‌న‌సుని దోచుకుంద‌ని... ముఖ్యంగా హీరోయిన్ న‌భా నటేష్ దోచుకుంద‌ని యూనిట్ తో త‌న ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా

 

ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ఇంకా ఏమన్నారంటే...

"సుధీర్ బాబు ఫస్ట్ ప్రొడక్షన్స్ కి కంగ్రాట్స్. ఫస్ట్ ప్రొడక్షన్ లోనే మంచి సినిమా తీశావు. చిన్న సినిమా... పెద్ద సినిమా అనే తేడా లేదు. సినిమా ప్రేక్షకులకందరికీ నచ్చితే పెద్ద సినిమా అవుతుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పెద్ద సినిమా తీయడం... సక్సెస్ కొట్టడం చాలా కష్టం. దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సుధీర్ బాబు సినిమాలన్నింటిలోకి ఇందులో పెర్ ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. నెంబర్ వన్ గా చేశాడు. చాలా రియలిస్టిక్ గా చేశాడు. నభా నటేష్ చాలా చక్కగా చేసింది. పెర్ ఫార్మెన్స్ వేరీ వెరీ గుడ్. రియల్లీ ఇన్ స్పైర్ డ్. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా ఒక్క షాట్ కూడా తప్పు లేకుండా... ఎక్కడ ఏం వాడాలో... ఎక్కడ డ్రోన్ వాడాలో... చక్కగా కట్ చేశాడు. ఫొటోగ్రఫి చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నన్ను దోచుకుందువటే పెద్ద సినిమా కిందే లెక్క. పెద్ద మైనస్ ఏంటంటే... ఒక్క తప్పు కూడా లేకపోవడం... కొత్త గా తీసే వాళ్లంటే నాకు చాలా బాగా ఇష్టం. కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీం. కంగ్రాట్యూలేషన్స్ అండ్ అల్ ది బెస్ట్". అని అన్నారు.

Facebook Comments
Veteran filmmaker K. Raghavendra Rao praises Nannu Dochukunduvate movie team

About uma

%d bloggers like this: