Social News XYZ     

Aravinda Sametha Pre-Release event will be held in Tirupati

తిరుపతిలో అరవింద సమేత ఫంక్షన్ !

Aravinda Sametha Pre-Release event will be held in Tirupati

ఎన్‌టి‌ఆర్ నటించిన అరవింద సమేత సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడేకొద్ది చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచుతోంది. అక్టోబర్ 7న ఈ సినిమా ప్రీ రిలీస్ వేడుక గ్రాండ్ గా చెయ్యడానికి రంగం సిద్దం చేస్తోంది. ఈ ఫంక్షన్ హైదారాబాద్ లో చెయ్యాలా ? తిరుపతిలో చెయ్యాలా ? అనేది త్వరలో చిత్ర నిర్మాత నిర్ణయం తీసుకోబోతున్నారు. సినిమాలో ఎన్‌టి‌ఆర్ చిత్తూరుకు చెందిన యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు కావున ఫంక్షన్ తిరుపతిలో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు.

 

ప్రీ రిలీస్ ఈవెంట్ లో సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు. మాస్ ఎంటటైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో త్రివిక్రమ్ కంబ్యాక్ అవుతాడని టాక్. సినిమా మొత్తం ఒకే ఎమోషన్ తో ఉంటుందని ఎక్కడా కామిడీ ఉండదని తెలుస్తోంది. సాంగ్స్ కూడా ఎక్కడా సినిమా కథను డిస్టర్బ్ చేయకూడదని పాటలు కూడా ఎక్కువ లేవు. ఎన్‌టి‌ఆర్ ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.

Facebook Comments

%d bloggers like this: