Social News XYZ     

Chiyaan Vikram’s Saamy censored, releasing Worldwide on September 21st

‘సామి’ సెన్సార్ పూర్తి- సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల

Chiyaan Vikram's Saamy censored, releasing Worldwide on September 21st

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన 'సామి' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతోన్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలచేయనున్నారు.

 

చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాతలు: బెల్లం రామకృష్ణ రెడ్డి, కావ్య వేణు గోపాల్.

Facebook Comments
Chiyaan Vikram's Saamy censored, releasing Worldwide on September 21st

About uma

%d bloggers like this: