Social News XYZ     

Aravinda Sametha Veera Raghava movie audio updates

అరవింద సమేత ఆడియో డేట్ ఫిక్స్ !

Aravinda Sametha Veera Raghava movie audio updates

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌ సినిమాలోని తొలి పాట విడుద‌లైంది. అన‌గ‌న‌గా అంటూ సాగే ఈ పాట‌కు అదిరిపోయే బీట్ ఇచ్చాడు థ‌మ‌న్. తాజాగా పినిమిటి అనే ఎమోషనల్ సాంగ్ బయటికి వచ్చింది. అభిమానుల నుండి సినీ ప్రముఖుల నుండి ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఎన్టీఆర్ సినిమా కోసం మ‌రోసారి ఫ్రెష్ ట్యూన్స్ తీసుకొచ్చాడు తమన్. గురువారం ఈ సినిమాలోని అన్ని పాటలు విడుదల కాబోతున్నాయి.

 

సెప్టెంబర్ 20 న అరవింద సమేత సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా చెయ్యాలి అనుకున్నారు. కానీ ఆడియో ఫంక్షన్ కాకుండా ప్రీ రిలీస్ ఈవెంట్ అక్టోబర్ 7న గ్రాండ్ గా చెయ్యాలని అనుకుంటున్నారు. మహేష్ బాబు ఈ ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రేత్యేక శ్రద్ద తీసుకొని చేస్తున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Facebook Comments

%d bloggers like this: