Social News XYZ     

Puri Jagannath gave narration to 3 Heroes!

ఆ ముగ్గురు హీరోలకు కథలు చెప్పిన పూరి !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు స్లో అయ్యాయి. వరుసగా ప్లాప్స్ పడడంతో ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి పెద్దహీరోలు ఎవ్వరు ఆసక్తిగా లేరు. తాజాగా ఈ డైరెక్టర్ తన కుమారునితో తీసిన మెహుబూబ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో మళ్ళీ ఆకాష్ తో పూరి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆకాష్ సినిమా కొత్త దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది. పూరి సొంతంగా కథ రాసి నూతన దర్శకుడితో సినిమా చేయిస్తున్నారు. అనిల్ పందురి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడు. మరి పూరి సినిమా ఎవరితో ఉంటుంది అనే సందేహాలు రావచ్చు.

ఈ మధ్య పూరి జగన్నాధ్ నానికి ఒక స్టోరి నరేట్ చేసాడు, అది పూర్తి స్థాయిలో నానికి నచ్చలేదు కావున ఆ సినిమా మొదలుకాలేదు. అలాగే అల్లు అర్జున్ కి కూడా ఒక చెప్పాడు పూరి. కానీ బన్నీ గత రెండు సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో పూరితో ఈ సమయంలో సినిమా చెయ్యడానికి ఆసక్తిగా లేడు. ఇదే క్రమంలో విజయ్ దేవరకొండకు పూరి ఒక మాస్ స్టోరి చెప్పారని తెలుస్తోంది. విజయ్ ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. విజయ్ ఈ సినిమా చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇలా వరుసగా ముగ్గురు పెద్ద హీరోలకు కథలు చెప్పిన పూరి చివరికి ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది. పూరి నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పక్కా న్యూస్ తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూద్దాం.

 

Facebook Comments

%d bloggers like this: