Social News XYZ     

Samanth’s “U-Turn” movie pre-release event held with Nagarjuna as chief guest

సమంత 'యూ టర్న్' ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

Samanth's "U-Turn" movie pre-release event held with Nagarjuna as chief guest

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ' యూ టర్న్'..  ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా రానుండగా పవన్ కుమార్ దర్శకుడు.. కాగా ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరగగా ఈ సమావేశానికి సినిమా నటీనటులతో పాటు నాగార్జున ముఖ్య అతిధిగా వచ్చారు..

 

హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకంటే ముందే పవన్ కుమార్ గారి లూసియా చూసి ఆయనతో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను.. యూటర్న్ తో ఆ కోరిక తీరింది. సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వచ్చే వెరైటీ సినిమాల్లో ఈ సినిమా టాప్ అని చెప్పొచ్చు.. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. చిన్న పాయింట్ ని తీసుకుని చాలా బాగా కథ అల్లారు.. ఇక సినిమా హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు.. మొదలయినప్పట్నుంచి రేపు రిలీజ్ అయ్యేంతవరకు చాలా పని చేసింది.. తన కోసం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.  మీరందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు..

దర్శకుడు పవన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమా తప్పక ఆడియన్స్ కి నచ్చుతుందని అనుకుంటున్నా.. సమంత గారు ఈ సినిమా లో చాలా బాగా చేశారు.. నాగార్జున గారు ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారనేది చూడాలని ఉంది.. అన్నారు..

నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. విజయశాంతి, అనుష్క గారి తర్వాత ఈ జెనరేషన్ లో సూపర్ స్టార్ అంటే సమంత.. ఆవిడతో చాలా టాలెంట్ దాగుంది.. ఈ సినిమాతో మీరు కూడా ఒప్పుకుంటారు.. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తే అది ఫ్లాప్ అయితే ఇందుకు ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమలంటారు.. కానీ ఈ సినిమా మీ అందరికి మంచి అనుభూతిని మిగిలిస్తుంది అన్నారు..

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. క్రౌడ్ ఫండెడ్ మూవీ గా దర్శకుడు పవన్ తీసిన లూసియా మంచి హిట్ అయ్యింది.. ఇప్పుడు యూ టర్న్ తో  మరో హిట్ కొట్టబోతున్నాడు.. ట్రైలర్ చూసాను.. చాలా బాగుంది.. సమంత తో ఇదే మాట చెప్పాను.. సామ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యాను.. ఒక ఇన్సిడెంట్ తో మొదలయ్యి సినిమా మొత్తం ఫజిల్ లా మరిన్ని మలుపులు తిరిగింది.. ఈ సినిమా ద్వారా వస్తున్న అందరికి గ్రాండ్ వెల్ కం.. సినిమా ద్వారా అందరికి విజయం చేకూరలని..కోరుకుంటూ అందరికి అల్ ద బెస్ట్.. అన్నారు..

సమంత మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేరిన నిర్మాతలకు చాలా థాంక్స్.. చిన్న సినిమానే అయిన ఒక పెద్ద సినిమా లుక్ ని తీసుకు వచ్చారు.. నిన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ఉన్నాం సినిమా చాలా బాగా వచ్చిందనుకుంటునాను.. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది... ట్రైలర్స్ కి, సాంగ్ కి మీరిచ్చిన సపోర్ట్ చూస్తుంటే సినిమా కూడా హిట్ అనిపిస్తుంది.. నన్ను సపోర్ట్ చేసినందుకు నా క్రూ కి చాలా థాంక్స్.. మేమంతా ఎంతో ఇష్టపడి చేసిన సినిమా .. రేపు స్క్రీన్ పైన అందరిని అలరిస్తుంది ఆశిస్తున్నా అన్నారు..

నటీనటులు :  సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ , నరేేన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు : 

దర్శకత్వం :  పవన్ కుమార్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారు
సంగీత దర్శకుడు :  పూర్ణ చంద్ర తేజస్వీ
డిఓపి :  నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్ :  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్
ఎడిటర్ : సురేష్ ఆరుముగం
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
P.R.O :  వంశీ - శేఖర్

Facebook Comments
Samanth's "U-Turn" movie pre-release event held with Nagarjuna as chief guest

About uma

%d bloggers like this: