Social News XYZ     

Maitrivanam movie audio launched

మైత్రీవనం ఆడియో విడుదల...

Maitrivanam movie audio launched

లక్ష్మీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, వెంకట్ , వృషాలీ, హర్షదా పాటిల్, రాజ్ బాలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుఖేష్ ఈశ్వరగారి నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మైత్రీవనం సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పీఆర్ సంగీతాన్నిఅందించిన మైత్రీవనం ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ తారామతి బారాదరిలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావు తదితర సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

 

బిగ్ సీడీ విడుదల అనంతరం నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ...మైత్రీవనం పాటలు బాగున్నాయి. ట్రైలర్ ఆకట్టుకుంది. చిన్న చిత్రాల్లో ఎంత సృజనాత్మకత ఉంటుందో మైత్రీవనం మరోసారి నిరూపిస్తోంది. వాళ్లకున్న కొద్దిపాటి బడ్జెట్ లో చక్కగా సినిమా రూపొందించారు. అన్నారు.

కల్వకుంట్ల కన్నారావు మాట్లాడుతూ....ప్రస్తుతం చిన్న చిత్రాలు అనూహ్య విజయాలు సాధిస్తున్నాయి. మైత్రీవనం అలాంటి సినిమానే కావాలి. ఇక సినిమా రూపొందించడం కంటే విడుదల చేయడం కష్టంగా ఉంది. ఈ సినిమా విడుదలకు మా వంతు సహకారం అందిస్తాం. అన్నారు.

నిర్మాత సుఖేష్ ఈశ్వరగారి మాట్లాడుతూ...ఒక చిన్న ఆలోచనతో మొదలైన చిత్రమిది. దర్శకుడు రవి గారు సరదాగా చెప్పిన అంశం నచ్చి దాన్ని విస్తృతమైన కథగా మార్చి సినిమా చేశాము. మాకున్న ప్రతి వనరుని ఉపయోగించి ఎంతో శ్రమించి మైత్రీవనం చిత్రాన్ని రూపొందించాం. పీఆర్ సంగీతం మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఇప్పుడున్న చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించే చిత్రమవుతుందని చెప్పగలను. అన్నారు.

దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ....మా సినిమాకు డబ్బుల కోసం కంటే మంచి సినిమాకు పనిచేస్తున్నామనే అంతా భావించారు. అలాగే కష్టపడ్డారు. ఈ చిత్రంతో మాకేం వస్తుందని వాళ్లెప్పుడూ ఆలోచించలేదు. యువతలో ఉన్న శక్తి అపారం. అది ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయగలదు. ఆ శక్తిని యువత గుర్తించేలా చేసే చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనలతో స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నాను. ఈ విశ్వంలో మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలడు, ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించగలడు, అద్భుతాలు సృష్టించగలడు అని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే ఈ మైత్రివనం. పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తూనే సందేశాత్మకంగా కథ సాగుతుంది. సినిమా మీద పూర్తి నమ్మకంతో రూపకల్పన చేశాం. ఇప్పుడు విడుదల కూడా అంతే నమ్మకంతో చేయబోతున్నాం. పీఆర్ పాటలు మా సినిమాకు బలంగా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే మైత్రీవనం సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. అని చెప్పారు.

జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, చంటి, వేణు, గెటప్ శ్రీను, రాజ్ బాలా, శరత్ కుమార్, ప్రసన్న తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - పీఆర్, ఎడిటర్ - కిషోర్ మద్దాలి, సినిమాటోగ్రఫీ - పరంధామ, కొరియోగ్రాఫర్ - ఆర్కే, విజువల్ ఎఫెక్ట్ - కార్టూనిస్ట్ నవీన్, కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం - రవి చరణ్. ఎం

Facebook Comments
Maitrivanam movie audio launched

About uma

%d bloggers like this: