Social News XYZ     

Vijay Antony’s Next Titled Roshagadu In Telugu

"రోషగాడు" గా విజయ్ ఆంథోని

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని. ప్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చెస్తూ వస్తొన్న ఈ హీరో ఇప్పుడు రోషగాడు గా ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో తిమిరపుడిచవాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు.

ఆగస్ట్ 1 సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చెయనున్నారు.కేరీర్ ప్రారంభం నుంచి విజయ్ ఆంథోని చేసిన సినిమాలు కథా బలమున్న చిత్రాలుగా ప్రశంసలను పొందాయి. అలాంటిది తొలిసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా , అంతే కమర్షియల్ టైటిల్ తో వస్తొన్న రోషగాడు తో విజయ్ ఆంథోని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి

 

నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా , డేనియల్ బాలాజీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంథోని నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. రచన-దర్శకత్వం గణేష్, పిఆర్ఓ: సాయి సతీష్.

Facebook Comments
Vijay Antony's Next Titled Roshagadu In Telugu

About uma

%d bloggers like this: