Social News XYZ     

Okate Life movie to release on August 22nd

ఆగస్ట్ 22న "ఒకటే  లైఫ్"

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత  ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం" ఒకటే లైఫ్" .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా  నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్ గా నిలుస్తుంది. ఆగస్ట్ 22న సినిమాను విడుదల చెస్తామన్నారు.

 

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ..  టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు  ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రమిది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు.‌ అమ్రీష్ అందించిన పాటలకు ఆదరణ బాగుంది. ఆర్. ఆర్. కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు

జితన్ రమేష్, శృతియుగల్, సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి ,శ్యామ్ ,దిశ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్ , కూర్పు: నందమూరి హరి, ఆర్ట్: విజయ్ కృష్ణ , పబ్లిసిటీ : సాయి సతీష్, కెమెరా: వై.గిరి, రచన: సతీష్ బండోజీ , దర్శకత్వం : ఎం.వెంకట్, నిర్మాత : నారాయణ్ రామ్

Facebook Comments
Okate Life movie to release on August 22nd

About uma