Social News XYZ     

Deeksha character in ‘Wife of Ram’ will be remembered by everyone: Lakshmi Manchu

క్ష పాత్ర అందరికీ గుర్తుండి పోతుంది.. మంచు లక్ష్మి

Deeksha character in 'Wife of Ram' will be remembered by everyone: Lakshmi Manchu

ఆద్యంతం ఉత్కంఠతను కలిగించే కథా, కథనాలతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ లను అందించేందుకు వైఫ్ ఆఫ్ రామ్ సిద్ధం అయ్యింది. ఈ నెల 20న ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈమూవీ ఎక్స్ పీరియన్స్ లను మీడియాతో షేర్ చేసుకుంది చిత్ర యూనిట్.

 

ఈ సందర్భంగా మంచులక్ష్మి మాట్లాడుతూ:
‘దీక్ష పాత్ర నాకు చాలా నచ్చింది. ప్రతి అమ్మాయి కూడా రిలేట్ అయ్యే విధంగా ఈ పాత్రను దర్శకుడు తీర్చి దిద్దాడు. దర్శకుడు విజయ్ ని ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో కలవడం జరిగింది. అతని వర్కింగ్ స్టైయిల్ నాకు నచ్చింది. కలసి పనిచేద్దాం అనే ఆలోచన ఈ కథ చెప్పగానే ఇంకేమి ఆలోచించలేదు. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను తప్పకుండా అందిస్తుంది. ఈ కథకు సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్, ఎడిటర్ తమ్మిరాజులు అందించిన సహాకారం మరువలేనిది. ’ అన్నారు.

దర్శకుడు విజయ్ యలకంటి మాట్లాడుతూ:
‘దీక్ష జర్నీ ని డాక్యుమెంటేషన్ చేయాలనుకున్నాను. ఎక్కడా కూడా సినిమాటిక్ ఎలివేషన్స్ ఉండవు. దీక్ష పాత్ర కు మంచు లక్ష్మి పూర్తి న్యాయం చేసారు. కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి. నేను ఎప్పుడూ ఆర్టిస్ట్ ని దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాయను. అందుకే ఈ పాత్ర పై మంచు లక్ష్మి ఇమేజ్ పడలేదు. మా కథను అర్ధం చేసుకొని సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్, ఎడిటర్ తమ్మిరాజు లు పనిచేసారు. రఘు ధీక్షిత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథను ప్రేక్షకులకు దగ్గర చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. తమ్మిరాజు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కొన్ని సందర్భాల్లో మాకు ధైర్యాన్ని ఇచ్చింది. దీక్ష చేసే పోరాటం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను ’ అన్నారు.

ఆర్టిస్ట్ ఆదర్శ్ మాట్టాడుతూ:
‘బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక నాకు వచ్చిన మొదటి ఆఫర్ ఇది. ఈకథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. వర్క్ షాప్ లు కండెక్ట్ చేయడం తో లోకేషన్ లో సీన్ చేయడం చాలా ఈజీ అయ్యింది. ఆర్టిస్ట్ గానేకాదు నిర్మాత గా కూడా మంచు లక్ష్మిగారు గ్రేట్. మమ్మల్ని చాలా కంపర్ట్ జోన్ లో ఉంచారు. ఈ పాత్ర నా కెరియర్ ని మలుపు తిప్పుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్ మాట్లాడుతూ:
‘ఈ అవకాశం ఇచ్చిన మంచు లక్ష్మిగారికి, దర్శకుడు విజయ్ కి థ్యాంక్స్. ఈ కథతో నేను చేసిన ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేను. ఖచ్చితమైన ప్రణాళిక తో 27 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. త్వరగా చేయాలని చేయలేదు. సినిమా కి తగినన్ని రోజులు చేసాం. మళ్ళీ ఇదే టీంతో పనిచేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

ఈ శుక్రవారం (20,న) విడుదల కాబోతోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.

సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, పీ.ఆర్.వో-జి.ఎస్.కె మీడియా- కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భాస్కర్ , సంగీతం : రఘు దీక్షిత్, మాటలు : సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ, నిర్మాణం- పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్,నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

Facebook Comments
Deeksha character in 'Wife of Ram' will be remembered by everyone: Lakshmi Manchu

About uma

%d bloggers like this: