Social News XYZ     

Hebah Patel And Arun Adith’s 24 Kisses Movie Teaser Released By Ileana Gets Good Response

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన!

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' సినిమా ఫస్ట్ లుక్ కు , హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. 'మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'మిణుగురులు' చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.

సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. 24 కిస్సెస్ సినిమా అదే కోవలోకి చేరబోతోంది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి.

 

నటీనటులు:
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి.
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.
కెమెరామెన్: ఉదయ్ గుర్రాల
మ్యూజిక్: జాయ్ బరువ
ఎడిటర్: ఆలయం అనిల్
రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్.
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ
కో.డైరెక్టర్: శ్రవణ్ కుమార్
పి. ఆర్.ఓ: వంశీశేఖర్​

Facebook Comments
Hebah Patel And Arun Adith's 24 Kisses Movie Teaser Released By Ileana Gets Good Response

About uma