Social News XYZ     

Naa Love Story movie to release on June 29th

ఈ నెల 29న ‘‘ నా లవ్ స్టోరి’’

Naa Love Story movie to release on June 29thఅశ్వని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి నిర్మాతగా, శివగంగాధర్ దర్శకత్వంలో మహిధర్ , సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ నాలవ్ స్టోరీ’. ప్రేమ కథలలో ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచానాలను తెచ్చుకున్న ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ ‘బొమ్మరిల్లు లాంటి క్యూట్ లవ్ స్టోరి, యూత్ అండ్ ఫ్యామిలీ చూడవలసిన సినిమా‘ నా లవ్ స్టోరి’ అని, హీరో, హీరోయిన్ల్ కొత్తవారైనా సీనియర్స్ కి ధీటుగా బాగా చేశారని, శివన్నారాయణ, తొటపల్లి మధు కామెడీ కడుపుబ్బ నవ్వింస్తుందని, ఇందులోని రెండు సాంగ్స్ నార్త్ బ్యాంకాక్ లోని ‘చియాంగ్ మై’ లో షూట్ చేశాం. హీరో, హీరోయిన్స్ కి ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. ’ అన్నారు.

డైరెక్టర్ శివగంగాధర్ మాట్లాడుతూ...‘ కాలేజ్ లో అడుగు పెడుతున్న యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగాప్రేమలో పడేవాళ్ళకి ఆల్ రెడీ ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చిన స్టోరి ‘ నాలవ్ స్టోరి’. ‘‘ అష్టాచమ్మా’’, ‘‘ ఉయ్యాలా జంపాలా’’,‘‘పెళ్ళి చూపులు’’ లాంటి నేచురల్ లవ్ స్టోరి అని, కొత్త వాళ్ళైనా బాగా చేశారని, ఈ సినిమా చూసి మీరే చెప్తారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ కి, సాంగ్ ప్రోమోస్ కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రేమ లో వచ్చే అవరోధాలను విభిన్నమైన కోణంలో చర్చించడం జరిగింది. ట్రైలర్ కి, పాటలకు మంచి రెస్సాన్ రావడం ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ’ అన్నారు.

 

నటీ నటులు:

మహిధర్ , సోనాక్షిసింగ్ రావత్ , శివన్నారయణ, తోటపల్లి మధు, చమ్మక్ చంద్ర, డి.వి, దివ్యశ్రీ గౌడ్, సరిత రెడ్డి, రాకేష్, భూపతి రాజు

టెక్నిషియన్స్:

మాటలు: మాల్కారి శ్రీనివాస్, పాటలు: శివశక్తి దత్తా, భువనచంద్ర, డాన్స్: బంగార్రాజు, ఫైట్స్: రామ్ సుంకర , ఎడిటర్: నందమూరి హారి, సంగీతం : వేదనివాన్ , డి ఓ పి : కిరణ్ , ఎగ్జిక్యూటివ్ , ప్రొడ్యూసర్: కె. శేషగిరి రావు, నిర్మాతలు: లక్ష్మి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ గంగాధర్​

Facebook Comments
Naa Love Story movie to release on June 29th

About uma

%d bloggers like this: