Social News XYZ     

Ammammagarillu Review: Makes your eyes wet

Ammammagarillu Review: Makes your eyes wet

ముందుమాట‌:ఛ‌లోహిట్ తో యంగ్ హీరో నాగ‌శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ల‌వ‌ర్ బోయ్ క్యారెక్ట‌ర్ల‌తో మెప్పించిన నాగ‌శౌర్య ఈసారి అమ్మ‌మ్మ‌గారిల్లు అంటూ బంధాలు..అనుబంధాలు..ఆప్యాయ‌త‌ల‌ను గుర్తుచేసే బ‌రువైన బాధ్య‌త‌ను తీసుకున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ అంద‌ర్నీ విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చాలాకాలం త‌ర్వాత మ‌ళ్లీ కుటుంబ కథ చిత్రం కావడం..అదీ అమ్మ‌మ్మ స్టోరీ కావ‌డంతో ప్రేక్షకులు కూడా రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ సినిమా నేడు విడుద‌లైంది. మ‌రి ఆ చిత్రం ప్రేక్ష‌కుల‌ అంచ‌నాల‌ను అందుకుందా? లేదా? అన్న‌ది స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

క‌థ‌: సీతామ‌హాల‌క్ష్మి(సుమిత్ర‌)-సూర్య‌నారాయ‌ణ‌(చ‌ల‌ప‌తిరావు) ది పెద్ద కుటుంబం. అంతా క‌లిసి ఉండాల‌నుకుంటారు. కానీ ఆస్తి పంప‌కాల‌పై పేచీలు మొద‌ల‌వుతాయి. ఇంత‌లో సూర్య‌నార‌య‌ణ చ‌నిపోతాడు. దాంతో కుటుంబం చ‌ల్లాచెదుర‌వుతుంది. కొడుకులు..కూతుళ్లు ఎవ‌రి దారిన వాళ్లు వెళ్లిపోతారు. 20 ఏళ్లు అయినా తిరిగిరారు. కానీ చిన్న‌ప్పుడు అమ్మ‌మ్మ‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా సంతోష్ (నాగ‌శౌర్య‌) మ‌ళ్లీ అమ్మ‌మ్మ‌ను చూడాల‌నుకుంటాడు. అందుకోసం సంతోష్ ఏం చేసాడు? చెల్లాచెదురైన ఆ కుటుంబాన్ని మ‌ళ్లీ క‌లిపాడా? లేదా? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

ఎనాల‌సిస్: ప్రేమ, అనుబంధం, ఆప్యాయ‌త‌, కోపాలు, తాపాలు, భావోద్వేగాలతో మిళిత‌మైన క‌థ. డ‌బ్బు మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని పెంచుతుంది అనే పాయిట్ ను ఆధారంగా చేసుకుని క‌థ‌ను అద్భుతంగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అమ్మ‌మ్మ, కూతుళ్లు, కొడుకులు, మ‌న‌వ‌లు చుట్టూ క‌థ తిరిగుతుంది. ఓ ప‌ల్లెటూరులో అంద‌మైన ఇల్లు...వివిధ స్వ‌భావాలు గ‌ల పాత్ర‌లు. ప్ర‌తీ పాత్ర‌ను చాలా చ‌క్క‌గా డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఒక్కో పాత్ర‌కు ఒక్కో ప్ర‌త్యేక‌త‌..స్వ‌భావం గ‌ల‌వి. ఆ పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అయ్యేలా స‌న్నివేశాల‌ను రాసుకున్న తీరు..వాటిని తెర‌పై ఆవిష్క‌రించిన విధానం అత్యద్భుతంగా ఉంది. పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ల‌ను ద‌ర్శ‌కుడు చాలా క‌నెక్టివ్..క‌న్వెన్సింగ్ గా చెప్పాడు. ముఖ్యంగా రావు ర‌మేష్ , నాగ‌శౌర్య పాత్ర‌ల‌ను మ‌లిచిన విధానం సినిమాకు హైలైట్ గా ఉంటుంది. డ‌బ్బు అంటే వ్యామోహం తో ఉండే రావు ర‌మేష్‌...సంతోషాన్ని మించింది ఏముంటుంద‌ని న‌మ్మే నాగ‌శౌర్య పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఆరంభ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ప్రేక్ష‌కుడు క‌థ‌కు చాలా ఈజీగా క‌నెక్ట్ అయిపోతాడు. అమ్మ‌మ్మ‌తో అనుబంధం ఉన్న వారికి సినిమా బాగా క‌నెక్ట్ అవుతుంది. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ స్టోరీ బ‌లహీనంగా ఉన్న‌ప్ప‌టికీ మూల క‌థ బ‌లంగా సాగ‌డంతో ఆవేవి సినిమాకు మైన‌స్ గా అనిపించ‌వు. నాగ‌శౌర్య తెర‌పై చాలా కొత్త‌గా క‌నిపించాడు. పాత్ర‌లో చాలా బ్యాలెన్సింగ్ న‌టించాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ల‌వర్ బోయ్ గా మెప్పించిన నాగ‌శౌర్య ఈ సినిమాతో యూనిట్ చెప్పిన‌ట్లు మంచి ఫ్యామిలీ హీరో అయిపోయాడు. ఇప్పుడు ప్రేక్ష‌కుల మాట కూడా ఇదే కావ‌డం విశేషం.

న‌టీన‌టులు: తెర‌పై కొత్త నాగ‌శౌర్య‌ను చూస్తాం. పాత్ర‌లో ఒదిగిపోయాడు. టాలీవుడ్ కు ఫ్యామిలీ హీరోలు లేని కొర‌త‌ను నాగ‌శౌర్య తీర్చేసాడు. షామిలీ ఎగ్రెసివ్ పాత్ర‌కు బాగా కుద‌రింది. రావు ర‌మేష్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుంది. న‌టుడిగా రావు ర‌మేష్ ను మ‌రో మెట్టు పైకి ఎక్కించిన సినిమా. శ‌క‌ల‌క శంక‌ర్ కామెడీ సినిమాకు బాగా క‌లిసొస్తుంది. క‌థ ఒకే ప్లోలో వెళ్తున్న శంక‌ర్ కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. సుమిత్ర‌, సుధ‌, హేమ‌, శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ పాత్ర‌లు బాగున్నాయి. ఎవ‌రి పాత్ర‌ల్లో వాళ్లు ఒదిగిపోయారు. మిగిలిన క్యారెక్ట‌ర్లు ఫ‌రిది మేర క‌నిపిస్తాయి.

సాంకేతిక వ‌ర్గం: సుంద‌ర్ సూర్య చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. డెబ్యూ ద‌ర్శ‌కుడు అనే ఫీలింగ్ ఎక్క‌డా క‌ల‌గ‌లేదు. టేకింగ్ బాగుంది. మంచి ద‌ర్శ‌కుడే కాదు...మంచి ర‌చ‌యిత అని తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. క‌థ‌, మాట‌లు, క‌థ‌నం రాసుకున్న విధానం..దాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు బాగుంది. అంత‌మంది ఆర్టిస్టుల‌తో బ్యాలెన్సింగ్ గా చేయించ‌డం అంటే చిన్న విషయం కాదు. అందులో ద‌ర్శ‌కుడు నూటికి నూరుపాళ్లు స‌క్సెస్ అయ్యాడు. ర‌సూల్ కెమెరా ప‌నిత‌నం ప్ర‌శంస‌నీయం. ప్ర‌తీ స‌న్నివేశాన్ని చాలా అందంగా చూపించారు. అక్క‌డ‌క్క‌డా ఎడిటింగ్ లోపాలున్నాయి. సంగీతం, నేప‌థ్య సంగీతం బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు అణువ‌ణువునా క‌నిపిస్తాయి.

చివ‌రిగా: క‌న్నీరు పెట్టించిన అమ్మ‌మ్మ‌గారిల్లు

Facebook Comments
Ammammagarillu Review: Makes your eyes wet

About uma

%d bloggers like this: