Social News XYZ     

Driver Ramudu movie in third gear

మూడో గేర్ లో డ్రైవర్ రాముడు

Driver Ramudu movie in third gear

శకలక శంకర్... తాను తెర మీద కనపడగానే థియేటర్ మొత్తం నవుళ్ళతో నిండిపోతుంది. ఇలా నవ్వులతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు శంకర్ హీరో గా వస్తున్నాడు అని మనఅందరికి తెలుసు. శకలక శంకర్ హీరో గా చేస్తున్నాడు అనగానే ప్రేక్షకులకు అద్భుతమైన కామెడీ సినిమా వస్తుంది అని అర్ధం అయింది. ఇటీవలే మొదటి ప్రచార చిత్రం మరియు 'డ్రైవర్ రాముడు' టైటిల్ ని విడుదల చేసి ప్రేక్షకుల అంచనాలు రేటింపు చేసారు. సినిమా ఎంతో అద్భుతం గా వస్తుంది అని నిర్మాతలైన వేణు గోపాల్ కొడుమగుళ్ల , ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ తెలియజేసారు.

 

రాజ్ స‌త్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సినిమా పీపుల్ పతాకం పై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ నిర్మిస్తున్నారు. రెండు షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో మరియు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలు , ఒక్క పాటని మరియు కొని కీలకమైన సన్నివేశాల్ని చిత్రకరిస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించిన శంక‌ర్‌లో మ‌రో కొత్త కొణం ఈచిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంక‌ర్ మార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది. ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీ లో మరియు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకుంటున్నాము. అని తెలిపారు.

తెలుగు ప్రజల దేవుడు ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ డ్రైవర్ రాముడు టైటిల్ ని మళ్లీ తమ సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్ గా భావిస్తున్నట్లుగా తెలిపారు. శంకర్ మరియు ఇతర కమెడియన్ లు చాలా బాగా చేసారు. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టుగా తెరకేక్కిన్చారు. సినిమా చాల బాగా వస్తుంది అందరినీ బాగా నావిస్తుంది. త్వరలో అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మా డ్రైవర్ రాముడు చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.

ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.
బ్యానర్- సినిమా పీపుల్స
సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్
మ్యూజిక్ - సునీల్ కశ్యాప్
ఆర్ట్ - రఘు కుల్ కర్ణి
డిఓపి - అమర్ నాథ్
నిర్మాతలు - వేణు గోపాల్ కొడుమగుళ్ల , ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్
దర్శకత్వం - రాజ్ సత్య

Facebook Comments
Driver Ramudu movie in third gear

About uma