Social News XYZ     

Naa Peru Surya Naa Illu India’s 3rd song “Beautiful Love” launched

అల్లు అర్జున్ "నా పేరు సూర్య " చిత్రంలోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

Naa Peru Surya Naa Illu India's 3rd song "Beautiful Love" launched

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

 

ఆ మధ్య రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఈ మధ్యే రిలీజ్ చేసిన లవర్ ఆల్సో ఫైటర్ అల్సొ సాంగ్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక ఇప్పుడు బ్యూటిఫుల్ లవ్ అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ... నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా లోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని రిలీజ్ చేశాం. ఇది నా ఫేవరేట్ సాంగ్. నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్ శేఖర్ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. స్పెషల్ గా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. సింగర్స్ ఆర్మాని మాలిక్, చైత్ర, అంబడి పూడి. అద్భుతంగా పాడారు. సీతారామ శాస్త్రి గారు మంచి సాహిత్యం అందించారు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. యాక్షన్ పార్ట్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా మా డైరెక్టర్ వక్కంతం వంశీ టైటిల్ కి తగ్గట్టుగా... కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారు. వారం రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దీంతో గుమ్మడికాయ కొట్టేస్తున్నాం. ఈ నెల 22న గ్రాండ్ గా ఆడియో రేలీజ్ చేస్తున్నాం. 29 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఈ వేసవి లో రంగస్థలం అద్భుతమైన హిట్ కొట్టింది. అలాగే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మర్ కానుకగా వస్తున్న నా పేరు సూర్య సినిమా అందరిని తప్పకుండా అలరిస్తుంది. ఇక జాతీయ అవార్డులు గెలుచుకున్న బాహుబలి, ఘాజీ టీమ్ అందరికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. అని అన్నారు.

లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ.... అల్లు అర్జున్ తో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. నాకు బ్యూటిఫుల్ సాంగ్ చాలా చాలా ఇష్టం. మంచి మెలోడీ ఇచ్చారు. వాల్ట్ డిస్నీ సాంగ్ విన్నట్టుగా ఉంది. విశాల్ శేఖర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మే 4న మీ ముందుకు వస్తున్నాం. అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)

సాహిత్యం - సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్

సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి

సంగీతం - విశాల్ - శేఖర్

ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు

బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

సమర్పణ - k.నాగబాబు

సహ నిర్మాత - బన్నీ వాసు

నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి

రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Facebook Comments
Naa Peru Surya Naa Illu India's 3rd song "Beautiful Love" launched

About uma

%d bloggers like this: