Social News XYZ     

Nara Rohit’s Aatagallu movie team breaks pumpkin

గుమ్మడికాయ కొట్టిన ఆటగాళ్లు !!

సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు". పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటెలిజంట్ థ్రిల్లర్ కి "గేమ్ విత్ లైఫ్" అనేది ట్యాగ్ లైన్. నిన్నటితో ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నిన్న సాయంత్రం చిత్రబృందం సెట్ లో గుమ్మడికాయ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ.. "క‌థ న‌చ్చి ఇద్ద‌రు హీరోలు న‌టించ‌డానికి అంగీక‌రించారు. నారా రోహిత్‌గారు, జగపతిబాబుగారు ఇలాంటి క‌థ‌ను ఒప్పుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మంచి క‌థ‌లు వ‌స్తాయి. చాలా వైవిద్య‌మైన సినిమా ఇది. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు మురళి "ఆటగాళ్లు" చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. రామోజీ ఫిలిమ్ సిటీలో చిత్రీకరణ పూర్తయ్యింది. నిన్న సాయంత్రం సెట్ లో గుమ్మడికాయ కూడా కొట్టేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు. నారా రోహిత్ సరసన హీరోయిన్ గా దర్శనా బానిక్ పరిచయం కాబోతున్నారు.

 

ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.

Facebook Comments
Nara Rohit's Aatagallu movie team breaks pumpkin

About uma