ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జొన్నవిత్తుల పద్య వాద్యకచేరి విడుదల...(తెలుగు సాహిత్యంలో సరి కొత్త పద్య సృష్టి)
తెలుగు పదాలకు పద్యాలకు వన్నె తెచ్చిన కవులు మన చరిత్రలో చాలా మందే వున్నారు.పాశ్చాత్యపు పోకడలతో మన సాహిత్యానికి దూరమవుతున్న నేటి యువతను సైతం తన ఇంపైన పదాలతోసొంపైన సాహిత్యాన్ని అల్లి తన వైపు తిప్పుకున్న ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తులరామలింగేశ్వరరావు. కొన్ని వందల పాటలు రాసిన సినీ గీత రచయిత. అంతేనా...తెలుగుఅధికార భాషా సంఘంలో సభ్యుడుగా ఉంటూ తెలుగు భాషాభివృద్ది కోసం తన వంతు సహకారాన్ని అందించారు. పేరడీ పాటలు రాయడంలో దిట్ట అయిన జొన్నవిత్తులతెలుగు భాషాభిమానుల కోసం పద్య వాద్య కచేరి అందించారు.
ఇంతకీ... పద్య వాద్య కచేరి అంటే ఏమిటంటారా..? పద్యంలో వెలువడే ధ్వనులను...వాద్యం నుంచివచ్చే ధ్వనులను రెండింటిని కలగలిపి విచిత్రమైనటువంటి... రసవత్తరమైనభావములతో పద్యాన్ని పలికించడం ఈ పద్య వాద్య కచేరి ఉద్దేశ్యం. ఒక అక్షరాన్నిఅచ్చరించినప్పుడు దాని నుంచి చక్కటి నాదం వస్తుంది, వాద్యాన్ని వెలవరించినప్పుడు కూడా చక్కనినాదం వెలువడుతుంది. అక్షర నాదం.. స్వరనాదం.. రెండింటిని కలగలిపి విచిత్రంగాపద్యాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ప్రతిభ ఎవరికున్నా, ఎలా వున్నా అది కనపడేది మాత్రం సరైన వేదిక మీదే. సరైనప్రతిభను గుర్తించడమే కాదు, ఆ ప్రతిభను పది మంది ముందుకు తీసుకువెళ్ళడంలో పీపుల్మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడూ ముందుంటుంది. జొన్నవిత్తుల గారి పద్య వాద్య కచేరికిసరిగ్గా ఆ ప్రయత్నమే చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరెక్టర్వి.ఎన్.ఆదిత్య,సహ నిర్మాతవివేక్ కూచిభోట్ల పర్యవేక్షణలో రూపొందిన జొన్నవిత్తుల పద్య వాద్య కచేరిసీడీని ఏపీ సి.ఎం చంద్రబాబు నాయుడు ఈరోజు (21) అమరావతిలోని సి.ఎం క్యాంప్ ఆఫీస్ లో ఆవిష్కరించారు.తెలుగు భాషాభిమానుల కోసం వినూత్నంగా జొన్నవిత్తుల పద్య వాద్య కచేరి నిరూపొందించిన టీమ్ ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియాఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, ప్రముఖ తెలుగు కవి, గీత రచయిత జొన్నవిత్తుల పాల్గొన్నారు.
