Social News XYZ     

Nivaasi movie first look launched

ఉగాది శుభాకాంక్ష‌ల‌తో "నివాసి"

Nivaasi movie first look launched

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి ఫ్యామిలి ఎమోష‌న‌ల్ చిత్రంతో హీరొగా ప‌రిచ‌యం అయ్యి, న‌ట‌సింహం బాల‌కృష్ణ స‌ర‌స‌న జైసింహ లో మంచి పాత్ర‌లో క‌నిపించిన యంగ్ హీరో శేఖ‌ర్ వ‌ర్మ, మ‌ళ‌యాలి ముద్దుగుమ్మ‌లు వివియా, విధ్య లు జంట‌గా, ద‌త్తాత్రేయ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మ‌రియు గాయాత్రి ప్రోడ‌క్ష‌న్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నివాసి. ఈ చిత్రం మెద‌టి లుక్ ని ఉగాది శుభాకాంక్ష‌లతో విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని కె.ఎన్‌.రావు మ‌రియు టి.వి.వి.ఎస్‌.ఎన్ వ‌ర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స‌తీష్ రేగెళ్ళ ద‌ర్శ‌కుడు.

 

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి ఓ ఫ్యామిలి ఎమెష‌న్ చిత్రం లో ప్ర‌తి ప్రేక్ష‌కుడ్ని అల‌రించిన శేఖ‌ర్ వ‌ర్మ‌, వివియా, విద్య‌లు హీరోహీరోయిన్స్ గా స‌తీష్ రేగెళ్ళ ద‌ర్శ‌కుడు గా మా బ్యాన‌ర్స్ లో నిర్మిస్తున్న చిత్రం నివాసి. ఈ చిత్రం ఇప్ప‌టికే 70 శాతం కంప్లీట‌య్యింది. ఈ చిత్రం పై మా యూనిట్ అంతా చాలా న‌మ్మ‌కంతో వున్నాము. ఫ్యామిలి,యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా నిర్మిస్తున్నాము. చివ‌రి షెడ్యూల్ ని ఏప్రిల్ లో పూర్తిచేస్తాము. ప్రేక్ష‌కులంద‌రికి మా చిత్ర యూనిట్ త‌రుపున ఉగాది శుభాకాంక్ష‌లు.. అని అన్నారు

బ్యాన‌ర్‌.. ద‌త్తాత్రేయ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అండ్ గాయాత్రి ప్రోడ‌క్ష‌న్స్‌

నటీన‌టులు.. శేఖ‌ర్ వ‌ర్మ‌, వివియా, విధ్య‌, నాజ‌ర్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు

సినిమాటోగ్రాఫ‌ర్.. కె. చిట్టిబాబు
సంగీతం.. చ‌ర‌ణ్‌-అర్జున్‌
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌- ముర‌ళీ వీర‌వ‌ల్లి
నిర్మాత‌లు.. కె.ఎన్‌.రావు, టి.వి.వి.ఎస్‌.ఎన్ వ‌ర్మ
ద‌ర్శ‌క‌త్వం.. స‌తీష్ రేగెళ్ళ

Facebook Comments
Nivaasi movie first look launched

About uma